GHMC : జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో భారీగా బదిలీలు..

ABN , First Publish Date - 2023-07-10T22:58:51+05:30 IST

హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో ఇటీవలే పలువురు జోనల్ కమిషనర్, డీసీలు బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. వారం రోజులు కూడా పూర్తిగాక మునుపే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో పలువురు అధికారుల బదిలీ అయ్యారు...

GHMC : జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో భారీగా బదిలీలు..

హైదరాబాద్ : హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో ఇటీవలే పలువురు జోనల్ కమిషనర్, డీసీలు బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. వారం రోజులు కూడా పూర్తిగాక మునుపే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్‌లో పలువురు అధికారుల బదిలీ అయ్యారు. ఇందులో కొందరికి స్థాన చలనం, మరికొందరికి పదోన్నతులు కలిగిస్తూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వలు జారీ చేసింది.


బదిలీ అయ్యింది వీరే..

  • డీటీసీపీగా ఎస్.దేవేందర్ రెడ్డి

  • HMDA ప్లానింగ్ మెంబర్‌గా కూడా ఎస్.దేవేందర్ రెడ్డి బాధ్యతలు

  • హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా కె. విద్యాదర్

  • హెచ్ఎంఆర్ఎల్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఎస్. బాలకృష్ణ

  • రెరా కార్యదర్శిగా కూడా ఎస్. బాలకృష్ణకు బాధ్యతలు

  • పురపాలకశాఖ ప్లానింగ్ డైరెక్టర్‌గా జి.శివ శరణప్ప

  • హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్- 2 గా కె. శ్రీనివాస్

  • జీహెచ్ఎంసీలో సీసీపీగా ఎం.రాజేంద్ర ప్రసాద్ నాయక్

  • టౌన్ ప్లానింగ్ అదనపు డైరెక్టర్‌గా ఎం.భవాని రాణి

  • వీటీఏడీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా బి.ఎస్.చంద్రిక

  • జీహెచ్ఎంసీలో అదనపు సీసీపీగా బి.ప్రదీప్ కుమార్

  • గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ సిటీ ప్లానర్‌గా బి. వెంకన్న

  • జీహెచ్ఎంసీలో అదనపు సీసీపీగా కె. గంగాధర్ బదిలీలు జరిగాయి.

ఇటీవలే ఇలా..

కాగా.. ఈ నెల మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ.. వెయిటింగ్‌లో ఉన్న మరో ఐఏఎస్‌ అధికారికి పోస్టింగ్‌ ఇస్తూ నిర్ణయం తీసుకునన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా సర్కారు నియమించింది. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి, తెలంగాణ రాష్ట్ర సంయుక్త ఎన్నికల ప్రధానాధికారిగా నియమించింది. వీరిద్దరినీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) కార్యాలయంలో నియమించాలంటూ ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఏ ఏ పోస్టుల్లో నియమించాలన్నది కూడా వివరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిని బదిలీ చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్‌ను బదిలీ చేసి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించింది. గతంలో నిర్మల్‌ కలెక్టర్‌గా పని చేసి, వెయిటింగ్‌లో ఉన్న ముషారఫ్‌ అలీ ఫారూఖీని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా నియమించింది.

Updated Date - 2023-07-10T22:58:51+05:30 IST