Siddipet: ఆమె చదువు ముందు.. వైకల్యం చిన్నబోయింది..!

ABN , First Publish Date - 2023-02-02T15:06:57+05:30 IST

శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడి (God)ని నిందిస్తుంటారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు.

Siddipet: ఆమె చదువు ముందు.. వైకల్యం చిన్నబోయింది..!

సిద్ధిపేట: శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడి (God)ని నిందిస్తుంటారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధై

ర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలాంటి యువతే ఈ విద్యార్థిని. చదవాలని సంకల్పం ముందు వైకల్యం (Disability) అడ్డుకాదని నిరూపిస్తోంది. అమ్మ తోడుగా విద్యాభ్యాసం (Education) సాగిస్తూ విధిని ఎదురిస్తూ ముందుకు సాగుతోంది.

సిద్దిపేట జిల్లా (Siddipet Dist.), ఇమాంబాద్‌ (Imamabad)కు చెందిన భార్గవి (Bhargavi) నడవలేని స్థితిలో సమస్యలను ఎదిరిస్తూ ముందుకు సాగుతోంది. తనలో వైకల్యం ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ కృంగిపోకుండా ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకు సాగుతోంది. అరుదైన ఎముకుల వ్యాధి (Bone Disease) కారణంగా నడుమ భాగం మొదలు కాళ్లవరకు పీలగా మారి నడవలేని స్థితికి చేరింది. దీంతో తమ కుమార్తెను తల్లిదండ్రులు హైమావతి, చిరంజీవి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ప్రస్తుతం సిద్ధిపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. నిత్యం ఆమె వెంట తల్లి తోడుగా వస్తోంది. తరగతులు ముగిసేవరకు ఆవరణలో బీడీలు చుడుతుంది. ఒక తరగతి గది నుంచి మరో తరగతి గదికి, వాష్ రూంకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అమ్మ ఎత్తుకుని తీసుకువెళుతుంది. ఇమాంబాదు నుంచి కళాశాలకు ఐదు కి.మీ. మేర ఆటోలో రాకపోకలు సాగిస్తున్నారు. పట్టణంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేయగా 8.5 జీపీఏ సాధించింది.

భార్గవి పుట్టినప్పుడు కాళ్లు బాగానే ఉన్నా నెలలోపు ఆమెకు అరుదైన సమస్య ఎదురైంది. ఆ సమయంలో ఆస్పత్రిలో చూపించినా.. పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. కాలు ఎముకలపై బరువు పడితే విరిగే పరిస్థితి తలెత్తింది. అలా బాల్యంలో ఏళ్లపాటు అవస్థపడింది. దీంతో ఆమె తల్లి ఒకటో తరగతి నుంచి వెంట వెళ్లడం మొదలైంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తండ్రి చిరంజీవి యక్షగాన కళాకారుడు సరైన ఉపాధిలేక కూలిపని చేస్తున్నాడు. తల్లి బీడీలు చుడుతుంది. ప్రతి నెల కుటుంబం గడవటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలికకు వచ్చే కొద్దిపాటి దివ్యాంగ ఫించన్‌తో రోజులు వెల్లదీస్తున్నారు. ఆటో కిరాయి చెల్లింపులకు ప్రతి నెల నానా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి తమకు వైద్యం చేయించడంతోపాటు ఆర్థిక సాయం చేయాలని ఆ కుటుంబం కోరుకుంటోంది.

Updated Date - 2023-02-02T15:07:00+05:30 IST