BRS MLA: రేవంత్ రెడ్డి సర్కార్‌పై అన్ని వర్గాల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఈ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్ద కంజర్లలో దారుణం చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా రోకలిబండతో కొట్టాడు.
Harish Rao: రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని హరీష్‌రావు కోరారు.
Harish Rao: కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. కాళేశ్వరం వల్లనే తెలంగాణకు కంపెనీలు వస్తున్నాయని హరీష్‌రావు అన్నారు.
బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని, తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ ఉండాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
Ameenpur Case Twist: అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ బయటపడింది. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.
Ponnam Prabhakar Farmers: రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Harish Rao: దేవాలయ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన ప్రభుత్వ ఖజానా నుంచి కేసీఆర్ జీతాలు అందించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు చెప్పారు. ఎమ్మెల్యేగా సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, సీఎంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని హరీష్‌రావు చెప్పారు.
KCR: బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం తాను ఎక్కడ వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు.
మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ దొంగ స్వామీజీకి చెక్ పెట్టారు మెదక్ జిల్లా పోలీసులు. ఆడవారిని లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.