యువతను ప్రోత్సహించేందుకే జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

ABN , First Publish Date - 2023-01-10T23:49:41+05:30 IST

హుస్నాబాద్‌రూరల్‌, జనవరి 10: క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకు సీపీ శ్వేత ఆదేశాల మేరకు హుస్నాబాద్‌ పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్‌ సీఐ ఎర్రల కిరణ్‌ పేర్కొన్నారు.

యువతను ప్రోత్సహించేందుకే జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
కబడ్డీలో తలపడుతున్న మహిళా జట్లు

హుస్నాబాద్‌రూరల్‌, జనవరి 10: క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకు సీపీ శ్వేత ఆదేశాల మేరకు హుస్నాబాద్‌ పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్‌ సీఐ ఎర్రల కిరణ్‌ పేర్కొన్నారు. మంగళవారం హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలోని స్పోర్ట్స్‌ మైదానంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ఎస్‌ఐ శ్రీధర్‌, నరేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. 10, 11న జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించామన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుంచి 18 పురుషుల జట్లు, 8 మహిళల జట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఎంట్రీ నమోదు చేసుకున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొన్న విజేత జట్లకు 12న సిద్దిపేటలో సీపీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్‌, కోహెడ ఎస్‌ఐలు సజ్జనపు శ్రీధర్‌, నరేందర్‌రెడ్డి, పీడీ సత్యనారాయణ, పీఈటీలు జంగపెల్లి వెంకటనర్సయ్య, కే.వెంకటస్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు.

గజ్వేల్‌లో జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలు

గజ్వేల్‌ టౌన్‌, జనవరి 10: జనవరి 12 జాతీయ యూత్‌డే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో గజ్వేల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న మైదానంలో వాలీబాల్‌, గడ ఆఫీసులో చెస్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను ఏసీపీ రమేష్‌ ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నుంచి 25 వాలీబాల్‌ టీమ్స్‌, 43 మంది చెస్‌ పోటీల్లో పాల్గొన్నాయి. ప్రభుత్వ పీఈటీలు ఏలియాస్‌ రావు, రాజిరెడ్డి సమక్షంలో రెండురోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2023-01-10T23:49:42+05:30 IST