MLA Sayanna: సాయన్న అంత్యక్రియలు పూర్తి
ABN , First Publish Date - 2023-02-20T21:16:23+05:30 IST
: అభిమానుల అశ్రునయనాల మధ్య బీఆర్‌ఎస్ (BRS) కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలు లేకుండానే
హైదరాబాద్: అభిమానుల అశ్రునయనాల మధ్య బీఆర్‌ఎస్ (BRS) కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (MLA Sayanna) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని సాయన్న అనుచరులు డిమాండ్ చేశారు. చితిపై సాయన్న పార్థివదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాయన్న అభిమానుల నినాదాలు చేశారు. అయితే డిప్యూటీ స్పీకర్ పద్మారావు (Deputy Speaker Padma Rao), మైనంపల్లి హన్మంతరావు, మాగంటి గోపి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమనిగింది. వివాదాలు, ఆందోళనల మధ్య ఎట్టకేలకు సాయన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి.
సీఎస్ శాంతికుమారిపై కేటీఆర్ సీరియస్
సాయన్న అధికారిక అంత్యక్రియల నిర్వహిణపై సీఎస్ శాంతికుమారిపై మంత్రి కేటీఆర్ (KTR) సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే సాయన్న అధికారిక అంత్యక్రియలపై సీఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న ఆదివారం కావడంతో అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడడంతో సీఎస్ నుంచి జీఏడీకి వెళ్లని ఆదేశాలు వెళ్లలేదని చెబుతున్నారు. జీఏడీ నుంచి సంబంధిత కమిషనర్‌కు సమాచారం వెళ్లడంలో జాప్యం జరిగిందంటున్నారు. ఇలా జరగకుండా ఉండాల్సింది అంటూ అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.