Home » KTR
సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై అర్థంలేని కక్ష.. పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష వేశారని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా రేవంత్ ప్రభుత్వానికి పట్టడం లేదా అని కేటీఆర్ నిలదీశారు.
ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ముందుగా విదేశీ సంస్థకు డబ్బు బదిలీ చేసిన బ్యాంకర్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఆదాయపు పన్ను చెల్లించేవారికి, ఉద్యోగం చేస్తున్నవారికి, పాన్ కార్డులు ఉన్నవారికీ రైతు భరోసా ఇవ్వొద్దని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, ఇది సరైంది కాదన్నారు.
‘‘ఆరు గ్యారెంటీల్లో ఏదైనా ఒక గ్యారెంటీని అమలు చేయడం ఆలస్యం అవుతోందంటే దానికి కారణం ఆ పాపాత్ములే! ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేటలో భూములు.. ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ భూములు, హైటెక్ సిటీ సహా ప్రతిదీ అమ్మేశారు.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ విపిరారు. రుణమాఫీ వందశాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
నల్గొండకు నీళ్లు ఎవరు ఇచ్చారో అడుగుదాం హరీష్‌రావు, కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కేసీఆర్ కట్టారా.. వాళ్ల నాన్న కట్టిండా అని నిలదీశారు.
ఫార్ములా-ఈ కేసులో జైలుకు వెళితే యోగా చేసుకుంటానన్న కేటీఆర్.. ఇప్పుడెందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టులకు వెళితే తప్పు పట్టిన ఆయనే.. ఇప్పుడు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కారని నిలదీశారు.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సిద్ధమైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా-ఈ రేసు కేసును ముందుకు తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.