Kumaram Bheem Asifabad:వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:26 PM
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠ శాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ ఉప సంచాలకురాలు ఆర్ రమాదేవి సూచించారు.
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 14: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠ శాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ ఉప సంచాలకురాలు ఆర్ రమాదేవి సూచించారు. సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అమలు చేస్తున్న పదో తరగతి వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ పేపర్లను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మూల్యంకన శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఈ గ్రాండ్ టెస్ట్ ఆధారం విద్యార్థుల స్థాయి నిర్ధారించి వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో 1,173 మంది విద్యార్థులు మార్చిలో జరగబోయే పరీక్షలలో హాజరు కానున్నారన్నారు. విద్యార్థుల కోసం అమలు చేస్తు న్న ప్రత్యేక సమయసారాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పా రు. రోజు వారీగా స్లిప్ టెస్ట్ నిర్వహించి మూల్యంకనం చేయా లన్నా రు. ఉత్తమ ఫలితాల కోసం సమష్టిగా ఉపాధ్యాయులంతా కృషి చే యాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంఓ ఉద్దవ్, ఏటీడీవో క్షేత్ర య్య, జీసీడీవో శకుంతల, డీఎస్‌వో మీనారెడ్డి పాల్గొన్నారు.