MLA Marri Janardhan Reddy: బీఆర్‌ఎస్ జోలికొస్తే ఒక్కొక్కణ్నీ కాల్చి పడేస్తా..
ABN , First Publish Date - 2023-08-29T02:56:43+05:30 IST
బీఆర్‌ఎస్ జోలికొస్తే ఒక్కొక్కణ్నీ కాల్చి పడేస్తానంటూ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
తన ప్రసంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడుతున్నారని ఆగ్రహం
కాంగ్రెస్ చెయ్యి ఊడిపోతుందంటూ ఫైర్
తెలకపల్లి, ఆగస్టు 28: బీఆర్‌ఎస్ జోలికొస్తే ఒక్కొక్కణ్నీ కాల్చి పడేస్తానంటూ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు పడుతున్నారని సహనం కోల్పోయిన ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని బొప్పల్లిలో ఆదివారం రాత్రి జరిగిన ప్రజాప్రస్థానంలో మర్రి పదేళ్ల యాత్ర కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాతుండగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘బీఆర్‌ఎస్ జోలికొస్తే ఒక్కొక్కన్ని కాల్చి పడేస్తా.. నా జోలికొస్తే మీకే మైనస్’’ అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు తనను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని, తన క్యాడర్‌కు చెబితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కరు కూడా బయట తిరగలేరని హెచ్చరించారు. తాను తలుచుకుంటే కాంగ్రెస్ చెయ్యి ఊడిపోతుందని.. ఆ పార్టీ వారు తన గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఇదిలాఉండగా బొప్పల్లిలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూల్చివేశారని రగడ జరిగింది. దీనిపై స్థానిక పోలీ్‌సస్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరి యువకులను పోలీసులు పీఎ్‌సకు తరలించారు. ఇటు ఎమ్మెల్యే వ్యాఖ్యలు సోమవారం వైరల్ కావడంతో జిల్లాలోని పలు చోట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.