Nallu Indrasena Reddy : నేను త్రిపుర గవర్నర్‌నయితే.. రేవంత్‌కు బాధేంటో?.. రేవంత్‌కు బాధెందుకో?
ABN , First Publish Date - 2023-10-20T02:58:50+05:30 IST
‘‘నేను త్రిపుర గవర్నర్ అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎందుకు బాధపడుతున్నారో?’’ అని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ ఇంకా అనుకుంటున్నారని.. సమాజాన్ని
రెడ్లకు తానే ప్రతినిధినని ఆయన అనుకుంటున్నరు
3 సార్లు గెలిపించిన మలక్‌పేట ప్రజల వల్లే ఈ పదవి
ప్రధాని స్వయంగా ఫోన్ చేసి చెప్పడం సంతోషం
గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక త్రిపుర ప్రజలకు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్తా
బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్, చాదర్‌ఘాట్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను త్రిపుర గవర్నర్ అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎందుకు బాధపడుతున్నారో?’’ అని బీజేపీ సీనియర్ నేత నల్లుcమండిపడ్డారు. రెడ్లకు తానే ప్రతినిధినని రేవంత్ ఇంకా అనుకుంటున్నారని.. సమాజాన్ని విభజించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతసేపూ ఇతరులను ఇరకాటంలో పెట్టడమే రేవంత్ పని అని.. రెడ్డినైన తనకు గవర్నర్ పదవి వచ్చినందుకే ఆయన బాధపడుతున్నారని ఆరోపించారు. తన చిత్తశుద్ధి గురించి ఏపీ, తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. అలాగే.. ఎవరి పనితీరు ఏమిటో, ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో ప్రధాని మోదీకి బాగా తెలుసని స్పష్టం చేశారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని.. ఇందుకు తానే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి తన నియామకం గురించి చెప్పడం సంతోషం కలిగించిందని చెప్పారు. ‘‘నాకు గవర్నర్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ గుర్తింపు తెలంగాణలో పార్టీ సామాన్య కార్యకర్తలందరిదీ. వారి ఆనందమే నా ఆనందం. మూడుసార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న మలక్‌పేట ప్రజల కారణంగానే ఈ గౌరవం దక్కింది. ఇందుకు వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటా’’ అని ప్రజలకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ నేత బీఎల్ సంతో్‌షకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇంద్రసేనారెడ్డి.. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సకు రాజ్యాంగ వ్యవస్థలపై నిబద్ధత లేదు అని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ అవసరం లేదంటున్న వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అని బీఆర్‌ఎ్‌సపై మండిపడ్డారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే మోదీ సర్కారు హయాంలో ఈశాన్య రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని.. ఇప్పుడా అభివృద్ధిలో తనకూ భాగస్వామ్యం కల్పించడం తన అదృష్టమన్నారు. త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక.. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అక్కడి ప్రజలకు తెలియజేస్తానని ఆయన తెలిపారు. కాగా.. త్రిపుర గవర్నర్‌గా నియమితులయిన నేపథ్యంలో గురువారం ఇంద్రసేనా ఇంటివద్ద కోలాహలం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక.. రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రె్‌సకు నమ్మకం లేదని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డిని నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.