నూతనకల్ పీఏసీఎస్ చైర్మనపై అవిశ్వాసం
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:16 AM
సూర్యాపేట జిల్లా నూతనకల్ పీఏసీఎస్ చైర్మనపై అవిశ్వాసానికి డైరెక్టర్లు సిద్ధమయ్యారు.
నూతనకల్, డిసెంబరు 29 : సూర్యాపేట జిల్లా నూతనకల్ పీఏసీఎస్ చైర్మనపై అవిశ్వాసానికి డైరెక్టర్లు సిద్ధమయ్యారు. ఈ మేరకు 12 మంది సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీసును డీసీవో శ్రీనివా్‌సకు అందజేశారు. నాలుగేళ్ల కిందట పీఏసీఎ్‌సలోని 13 డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎర్రపహాడ్ డైరెక్టర్ పదవికి ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాడు. ఇందులో ఏడుగురు బీఆర్‌ఎస్, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ సభ్యులు ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి కనగటి వెంకన్న చైర్మన కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయసుద వైస్‌చైర్మన అయ్యారు. పాలకమండలి ఏర్పడ్డప్పటి నుంచి చైర్మనకు, డైరెక్టర్ల మద్య సఖ్యత లేదు. చైర్మన ఎవరినీ ఖాతరు చేయకపోవడం, డైరెక్టర్లకు తెలియకుండా సంఘంలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించడం, సభ్యులతో దురుసుగా ప్రవర్తించడం వంటి చర్యలతో వారి మధ్య ఎడమొహం, పెడమొహం అనే చందంగా మారింది. ఈ నేపథ్యంలో అవి శ్వాస తీర్మానంపై 12 మంది సభ్యులు సంతకాలు చేసి డీసీవోకు అందజేశారు. జనవరి 4న పీఏసీఎస్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం మేరకు సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అవిశ్వాసానికి కావలిసిన 9మంది డైరెక్టర్లు క్యాంప్‌కు తరలివెళ్లారు. చైర్మనతో పాటు మరో ముగ్గురు సభ్యులు అతడితో ఉన్నట్లు తెలిసింది. అవిశ్వాసతీర్మానం నోటీసుపై ఆ ముగ్గురు కూడా సంతకాలు చేశారు. చివరి దాకా చైర్మనతో ఉంటారా లేక లేదా అన్నది జనవరి 4న తేలనుంది.