ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్‌వి.. ఏం చేస్తావ్?
ABN , First Publish Date - 2023-06-05T03:00:31+05:30 IST
పంజాగుట్ట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం కేసీఆర్ వెళ్లే రూటు. ఆయన మూమెంట్ గురించి చెబుతున్నారు. దయచేసి లౌడ్ స్పీకర్లు ఆపండి’ అని అడిగిన ఓ కానిస్టేబుల్‌పై సాక్షాత్తూ అధికార పార్టీ నేతలే అంతెత్తున ఎగిరిపడ్డారు...
● నేను అధికార పార్టీ నాయకుణ్ని..
● నీ పై అధికారులే మమ్మల్నేం చేయలేరు
● సోమాజిగూడ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ భర్త
● వనం శ్రీనివాస్ వీరంగం
● సీఎం మూమెంట్ ఉంది.. లౌడ్ స్పీకర్లు
● ఆపమన్నందుకు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం
● బాధితుడి ఫిర్యాదుతో శ్రీనివాస్‌పై కేసు
పంజాగుట్ట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం కేసీఆర్ వెళ్లే రూటు. ఆయన మూమెంట్ గురించి చెబుతున్నారు. దయచేసి లౌడ్ స్పీకర్లు ఆపండి’ అని అడిగిన ఓ కానిస్టేబుల్‌పై సాక్షాత్తూ అధికార పార్టీ నేతలే అంతెత్తున ఎగిరిపడ్డారు. ‘మేం అధికార పార్టీ నాయకులం. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. నువ్వు ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్‌వి’ అని దూషించారు. అంతేకాదు.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గల్లా పట్టుకొని వీరంగం సృష్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజేశ్ ఈ నెల 2న సోమాజిగూడ మొనప్ప ఐలాండ్ వద్ద మరో కానిస్టేబుల్ ప్రకాశ్‌తో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అదే ప్రాంతంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత భర్త, బీఆర్‌ఎస్ నాయకుడు వనం శ్రీనివాస్ 10 లౌడ్ స్పీకర్లు పెట్టి వేడుకలు నిర్వహిస్తున్నారు. అప్పుడే ట్రాఫిక్ సెట్‌లో ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ మూమెంట్ గురించి చెబుతున్నారు. లౌడ్ స్పీకర్ల శబ్దానికి రాజేశ్‌కు అధికారులు చెప్పేది వినిపించలేదు. ‘సీఎం రూట్ ఉంది.. లౌడ్ స్పీకర్లు బంద్ చేయండి’ అని కానిస్టేబుల్ రాజేశ్.. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను, కార్పొరేటర్ భర్త వనం శ్రీనివాస్‌ను కోరారు. అంతే ఆగ్రహించిన శ్రీనివాస్.. తాను కార్పొరేటర్ భర్తనని, డివిజన్ ప్రథమ పౌరుణ్ని అంటూ రాజేశ్‌పై విరుచుకుపడ్డారు. ‘ఆఫ్ట్రాల్ నువ్వో కానిస్టేబుల్‌వి. నీ పై అధికారులు కూడా నన్నేం చేయలేరు’ అని రాజేశ్‌ను దుర్భాషలాడుతూ చొక్కా కాలర్ పట్టుకొని లాగారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజేశ్ అదేరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వనం శ్రీనివాస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు