IAS & IPS : ఒకరు ఐఏఎస్‌.. మరొకరు ఐపీఎస్‌ దండలు మార్చుకుని సాదాసీదాగా పెళ్లి

ABN , First Publish Date - 2023-08-10T03:30:16+05:30 IST

ఒకరు ఐఏఎస్‌.. మరొకరు ఐపీఎస్‌. ఎంతో అట్టహాసంగా జరగాల్సిన వారి పెళ్లి.. రిజిష్టర్‌ చేసుకుని, దండలు మార్చుకోవడంతో అయిపోయింది. వీరిలో ఒకరు కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ కాగా..

IAS & IPS : ఒకరు ఐఏఎస్‌.. మరొకరు ఐపీఎస్‌ దండలు మార్చుకుని సాదాసీదాగా పెళ్లి

మచిలీపట్నం, ఆగస్ట్టు 9(ఆంధ్రజ్యోతి): ఒకరు ఐఏఎస్‌.. మరొకరు ఐపీఎస్‌. ఎంతో అట్టహాసంగా జరగాల్సిన వారి పెళ్లి.. రిజిష్టర్‌ చేసుకుని, దండలు మార్చుకోవడంతో అయిపోయింది. వీరిలో ఒకరు కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ కాగా.. మరొకరు ఐపీఎస్‌ దేవేంద్రకుమార్‌. వీరిది రాజస్థాన్‌ రాష్ట్రం కాగా, దేవేంద్రకుమార్‌ హైదరాబాద్‌లో ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. వీరి వివాహాన్ని కొన్నాళ్ల కిందట ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో కుదుర్చుకున్నారు. బుధవారం జేసీ పుట్టినరోజు కావడంతో దేవేంద్రకుమార్‌ మచిలీపట్నం వచ్చారు. జేసీ చాంబరులోనే జిల్లా రిజిస్ర్టార్‌ జగన్మోహన్‌రావు సమక్షంలో అపరాజితసింగ్‌, దేవేంద్రకుమార్‌లు వివాహం చేసుకుని రిజిష్టరులో సంతకాలు చేశారు. ఆ తర్వాత దండలు మార్చుకున్నారు. వివాహం చేసుకుంటున్న దృశ్యాలను వారి కుటుంబ సభ్యులకు లైవ్‌లో చూపించారు.

Updated Date - 2023-08-10T03:42:09+05:30 IST