పంచాయతీ కార్మికుల సమ్మె విరమణ

ABN , First Publish Date - 2023-08-09T04:17:05+05:30 IST

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌ పాలడుగు భాస్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పంచాయతీ కార్మికుల సమ్మె విరమణ

సర్కారు స్పందించకుంటే మళ్లీ సమ్మె: జేఏసీ

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌ పాలడుగు భాస్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ కార్మికులు గత 34 రోజులుగా నిరవధిక సమ్మె చేశారని, సమ్మె విరమిస్తేనే.. సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్న మేరకు సమ్మె విరమించినట్లు పేర్కొన్నారు. బుధవారం అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు, డీపీవోలకు తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించి.. గ్రామ పంచాయతీల కార్మికులు విధుల్లో చేరనున్నట్లు ఆయన తెలిపారు. సర్కారు తగిన విధంగా స్పందించకుంటే మళ్లీ సమ్మెకు దిగనున్నట్లు స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-09T04:17:05+05:30 IST