Pawan Khera : బీఆర్ఎస్‌లో మరో మహిళ లేరా? కవిత ఒక్కరేనా?

ABN , First Publish Date - 2023-03-11T12:51:39+05:30 IST

శంషాబాద్ లో ఫ్లైట్ దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని.. బీఆర్ఎస్‌లో ఇంకో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు.

Pawan Khera : బీఆర్ఎస్‌లో మరో మహిళ లేరా? కవిత ఒక్కరేనా?

Hyderabad : శంషాబాద్ లో ఫ్లైట్ దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని.. బీఆర్ఎస్‌లో ఇంకో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు. నేడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితకి మహిళ సాధికారత గురించి ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే లిక్కర్ స్కాంలో కదలిక వచ్చిందన్నారు. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ మద్దతు ఎందుకు తెలుపుతోందని ప్రశ్నించారు. లిక్కర్ స్కాం పై ఫిర్యాదు చేసిందే మేము. కవిత ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో మహిళల హక్కుల కోసం ఎన్నిసార్లు మాట్లాడిందని పవన్ ఖేరా ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారే క్రమంలో కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని పవన్ ఖేరా ప్రశ్నించారు. సామాన్య ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం వాడుకుంటోందని విమర్శించారు. బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలన్నారు. తమ పోరాటం, ఒత్తిడి వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపిందన్నారు. తెలంగాణ తప్పితే వేరే రాష్ట్రంలో ఒక్క సర్పంచ్‌ని కూడా గెలిలించుకునే పరిస్థితి లేదని విమర్శించారు.

Updated Date - 2023-03-11T12:51:39+05:30 IST