Pawan Kalyan: కొండగట్టు, ధర్మపురిలో పవన్‌ పర్యటన

ABN , First Publish Date - 2023-01-23T18:17:21+05:30 IST

రేపు (మంగళవారం) కొండగట్టు (Kondagattu), ధర్మపురిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొండగట్టులో..

Pawan Kalyan: కొండగట్టు, ధర్మపురిలో పవన్‌ పర్యటన

హైదరాబాద్: రేపు (మంగళవారం) కొండగట్టు (Kondagattu), ధర్మపురిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొండగట్టులో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం నాచుపల్లిలో తెలంగాణ జనసేన నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ధర్మపురి నరసింహ స్వామిని పవన్‌ దర్శించుకోనున్నారు. ధర్మపురి (Dharmapuri) నుంచి అనుష్టుస్‌ నరసింహ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మరో 31 నరసింహ క్షేత్రాలు దశలవారీగా పవన్‌ సందర్శిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.

వారాహి ప్రత్యేకతలు

ఇటీవల కాలంలో పవన్‌ సభలు, రోడ్‌ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా... చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు. ఇక, వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్‌ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్‌ ప్రత్యేక సర్వర్‌కు రియల్‌ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-23T18:17:34+05:30 IST