‘ప్రజావాణి’ అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-04-25T00:19:47+05:30 IST

ప్రజావాణి అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌తో కలసి ప్రజావాణిలో ప్రజ ల నుంచి అర్జిలను స్వీకరించా రు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో మోతీలాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘ప్రజావాణి’ అర్జీలను వెంటనే పరిష్కరించాలి

నల్లగొండ టౌన్‌, ఏప్రిల్‌ 24 : ప్రజావాణి అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌తో కలసి ప్రజావాణిలో ప్రజ ల నుంచి అర్జిలను స్వీకరించా రు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో మోతీలాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మైనార్టీ కమిషన్‌ పర్యటనను విజయవంతం చేయాలి

జాతీయ మైనార్టీ కమిషన్‌ ఈ నెల 26న జిల్లా పర్యటించనుందని, అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ కోరారు. ఈమేరకు సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మైనార్టీ కమిషన్‌ సభ్యుడు సయ్యద్‌ హెహజాదీ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

తిప్పర్తి / నల్లగొండ టౌన్‌: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి, రైతులకు ఇబ్బందులు లేకుం డా చూడాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం తిప్పర్తి మండ లం రాయినిగూడెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం తడిగా ఉన్నా నేరుగా కాంటా చేస్తున్నారని, పూర్తిస్థాయిలో ఆరబెట్టాకే కాంటా వేయాలన్నారు. నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావిలో గొల్లగూడ పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు పరిశీలించారు. ఆయన వెంట పౌర సరఫరాలశాఖ జీఎం నాగేశ్వర్‌రావు ఉన్నారు.

Updated Date - 2023-04-25T00:19:47+05:30 IST