ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-06-24T23:57:30+05:30 IST
ముదిరాజ్ కులస్థులను దూషించిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
ధారూరు, జూన్ 24: ముదిరాజ్ కులస్థులను దూషించిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ముదిరాజ్‌లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, యూట్యూబ్ కెమెరామెన్‌పై భౌతికదాడికి పాల్పడినందుకు నిరసనగా ధారూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద లింగంపల్లి ఆశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముదిరాజ్‌లు నిరసన వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధారూరు ఉపసర్పంచ్ ఎల్.రాజేశ్వర్ ముదిరాజ్, నాయకులు తిరుపతయ్య, బి.అంజయ్య, వెంకటేశ్, శ్రీనివాస్, చంద్రయ్య, భిక్షపతి, నారాయణ, శివ, శేఖర్ పాల్గొన్నారు.
కులకచర్ల: ముదిరాజ్ కులస్థులను దూషించిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కులకచర్ల, చౌడాపూర్ మండలాల్లో నాయకులు చౌరస్తాలో బైఠాయించి ఎమ్మెల్సీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ వెంటనే ముదిరాజ్ కులస్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆనందం, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు, బీజేపీ మండల అద్యక్షుడు మహిపాల్, సంఘం నాయకులు శ్రీనివాస్, అంజిలయ్య, మహిపాల్, సాయిలు పాల్గొన్నారు.