పురుగుల మందు తాగి అటెండర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-03-17T00:11:20+05:30 IST
పురుగుల మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లేమూరులోని కెనరా బ్యాంకు అటెండర్ మట్ట కిషోర్‌గౌడ్ మృతిచెందాడు.
బ్యాంకు మేనేజర్ వేధింపులే కారణం : మృతుడి భార్య
కందుకూరు, మార్చి 16 : పురుగుల మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లేమూరులోని కెనరా బ్యాంకు అటెండర్ మట్ట కిషోర్‌గౌడ్ మృతిచెందాడు. అయితే, బ్యాంకు అధికారుల వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య చైతన్య ఆరోపించారు. బాదితులు గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ధన్నారం గ్రామానికి చెందిన మట్ట కిషోర్‌గౌడ్ కొన్నేళ్లుగా మండలంలోని లేమూరు గ్రామంలో ఉన్న కెనరా బ్యాంకులో అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ.. మండల కేంద్రంలో స్థిరపడ్డాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిషోర్‌గౌడ్ పురుగుల మందు తాగాడు. సాయంత్రం భార్య చైతన్య వచ్చి చూసే సరికి కిషోర్‌గౌడ్ అచేతన స్థితిలో ఉన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. కాగా, తన భర్త కెనరా బ్యాంకు మేనేజర్ నిహారిక వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య చైతన్య ఆవేదన వ్యక్తం చేసింది. మేనేజర్ వ్యక్తిగతంగా రుణం తీసుకొని తన భర్తను డబ్బులు కట్టమని వేధింపులకు గురిచేసిందని ఆరోపించింది. మృతుడికి కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.