బతుకమ్మ చీరలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2023-10-06T00:33:14+05:30 IST

బతుకమ్మ చీరలను ప్రతీమహిళ సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు.

బతుకమ్మ చీరలను వినియోగించుకోవాలి
పరిగి: మహిళలకు బతుకమ్మ చీరలను అందజేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌

యాలాల, అక్టోబరు 5: బతుకమ్మ చీరలను ప్రతీమహిళ సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు గురువారం బతుకమ్మ చీరలు పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, బీసీబంధు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రమేష్‌, మాజీ ఎంపీపీ పురుషోత్తంరావు, మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్‌, కోఆప్షన్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు అక్బర్‌బాబా, మాజీ ఏఎంసీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, ఎంపీడీవో పుష్పలీల పాల్గొన్నారు.

పరిగి: మునిసిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర పథకాలు దేశంలో ఎక్కడా లేదని, వివిధ రాష్ట్రాల్లోని సీఎంలే మన పథకాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రీనివాసన్‌, కౌన్సిలర్లు రవీంద్ర, టి.వెంకటేశ్‌, వి.కిరణ్‌, మునీరు నాగేశ్వర్‌రావు, ఎదిరె కృష్ణ, నాయకులు మౌలానా, రవికుమార్‌, అన్వర్‌ హుస్సేన్‌, ఎం.శేఖర్‌ పాల్గొన్నారు అనంతరం క్రీడాకారులకు ఉచితంగా స్పోర్ట్స్‌ కిట్స్‌ అందజేశారు.

బషీరాబాద్‌: మంతట్టిలో గురువారం స్థానిక సర్పంచ్‌ దశరథ్‌, ఎంపీటీసీ శ్రీధర్‌ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, డీలర్‌ పాల్గొన్నారు.

కీసర రూరల్‌: నాగారం మున్సిపాలిటీ పరిధి 17వ వార్డులో మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీని ప్రారంభించారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది వార్డుల్లోనూ ఆయావార్డుల కౌన్సిలర్లు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, వైస్‌చైర్మన్‌ మల్లే్‌షయాదవ్‌, కౌన్సిలర్లు అన్నంరాజ్‌ లావణ్య, సుమిత్ర, కో-ఆప్షన్‌ సభ్యుడు షఫీ, సానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాంరెడ్డి నాయకులు పాల్గొన్నారు.

దోమ: మండలంలోని అయినాపూర్‌, మల్లెపల్లి, మోత్కుర్‌, కిష్టాపూర్‌ గ్రామాల్లో గురువారం ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మల్లేశ్‌, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-06T00:33:14+05:30 IST