అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి
ABN , First Publish Date - 2023-04-14T23:25:01+05:30 IST
అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జ్ అధికారి బి.సురేందర్‌రెడ్డి అన్నారు.
తాండూరు/వికారాబాద్ రూరల్, ఏప్రిల్ 14: అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జ్ అధికారి బి.సురేందర్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అగ్ని ప్రమాదాల్లో మరణించి వారికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్నిప్రమాదాలను అంచనా వేయలేమని వాటి నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు జరిగే అగ్రిమాపక వారోత్సవాల సందర్భంగా శుక్రవారం తాండూరులో అగ్నిమాపక శాఖ జెండాను స్టేషన్ ఫైర్ అధికారి నాగార్జున ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం అగ్ని ప్రమాదం యందు ఉపయోగించే పనిముట్ల గురించి పట్టణవాసులకు తెలియజేశారు.