రెండు తలల మేకపిల్ల జననం
ABN , First Publish Date - 2023-03-23T00:17:02+05:30 IST
కీసరలో బుధవారం వింత ఘటన జరిగింది. ఓ మేకకు జన్యు లోపంతో రెండు తలల మేకపిల్ల పుట్టింది.
కీసర, మార్చి 22: కీసరలో బుధవారం వింత ఘటన జరిగింది. ఓ మేకకు జన్యు లోపంతో రెండు తలల మేకపిల్ల పుట్టింది. కీసరకు చెందిన కటిక నర్సింగరావు ఇంటిలో ఓ మేక సాయంత్రం ఈనింది. మేక మూడు పిల్లలు పెట్టగా అందుల్లో ఒక పిల్లకు రెండు తలలున్నాయి. కాగా రెండు తలల మేక పిల్ల ఆరోగ్యం విషమంగా ఉంది. జన్యు లోపం కారణంగానే ఇలా జరిగిందని పశువైద్యులు తెలిపారు.