బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం తప్పదు

ABN , First Publish Date - 2023-09-03T23:50:22+05:30 IST

గత ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు, ప్రజావ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.

బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం తప్పదు
టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

  • బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 100 మంది కార్యకర్తలు

బొంరాస్‌పేట్‌, సెప్టెంబరు 3: గత ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు, ప్రజావ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని సూర్యనాయక్‌తండాకు చెందిన 100మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు జి.నర్సింహులుగౌడ్‌ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ సారి ఎన్నికల సమయంలో మోసపూరిత వాగ్దానాలు, ఉచిత హామీలతో కాలం వెళ్లదీస్తున్న బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ తాము ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే మోసం చేశారని, రాష్ట్రంలో కేసీఆర్‌ భూములు విక్రయిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే రియల్‌ఎస్టెట్‌ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మల్లేశం, భీమయ్యగౌడ్‌, బాపల్లి సంతోష్‌, నాయక్‌, రవినాయక్‌, సూర్యప్రకాశ్‌, మోతిలాల్‌, వినోద్‌, సురేశ్‌, బబ్లునాయక్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-03T23:50:22+05:30 IST