రేవంత్‌రెడ్డిని కలిసిన చల్లా నర్సింహారెడ్డి

ABN , First Publish Date - 2023-05-19T23:29:48+05:30 IST

: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చల్లా నర్సింహారెడ్డి రెండో సారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

రేవంత్‌రెడ్డిని కలిసిన చల్లా నర్సింహారెడ్డి
రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న చల్లా నర్సింహారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, మే 19 : కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చల్లా నర్సింహారెడ్డి రెండో సారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో టీపీసీసీ జనరల్‌ సెక్రటరీలు వీర్లపల్లి శంకర్‌, బొర్ర జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీర్‌రెడ్డి, ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, జక్కడి ప్రభాకర్‌రెడ్డి, చిలక మధుసూదన్‌రెడ్డి, పీసీసీ సెక్రటరీ అమరేందర్‌రెడ్డి, మాజీ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ ఏనుగు జంగారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ పార్టీ సీనియర్‌ నాయకులు సున్నపు వసంతం, బీమ్‌భారత్‌, చేవెళ్ల సమన్వయ కమిటీ చైర్మన్‌ చింపుల సత్యనారాయణరెడ్డి, నాయకులు పల్గుట్ట జనార్ధన్‌రెడ్డి, యాలాల మహేశ్వర్‌రెడ్డి, జయమ్మ, కృష్ణ, ఎ. వెంకటే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-19T23:29:48+05:30 IST