ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు
ABN , First Publish Date - 2023-04-03T00:00:56+05:30 IST
ఇటీవల కురిసిన వర్షాలకు కొత్లాపూర్ గ్రామంలో శ్రీశైలం అనే రైతు పొలంలో విద్యుత్‌వైర్లు చేయికందే ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి.
పట్టించుకోని అధికారులు
మర్పల్లి, ఏప్రిల్ 2: ఇటీవల కురిసిన వర్షాలకు కొత్లాపూర్ గ్రామంలో శ్రీశైలం అనే రైతు పొలంలో విద్యుత్‌వైర్లు చేయికందే ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని బాధిత రైతు వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు వెంటనే విద్యుత్ వైర్లను సరిచేసి సమస్యను పరిష్కరించాలని బాధిత రైతు కోరాడు.