భార్యతో గొడవపడి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యం
ABN , First Publish Date - 2023-04-21T00:36:52+05:30 IST
వ్యక్తి అదృశ్యమైన సంఘటన దిర్సంపల్లిలో గురువారం జరిగింది. మంగలి రాంచంద్రయ్య భార్య లక్ష్మితో ఈ నెల 18న గొడవపడ్డారు.
దోమ, ఏప్రిల్ 20: వ్యక్తి అదృశ్యమైన సంఘటన దిర్సంపల్లిలో గురువారం జరిగింది. మంగలి రాంచంద్రయ్య భార్య లక్ష్మితో ఈ నెల 18న గొడవపడ్డారు. దీంతో లక్ష్మి పుట్టింటికి వెళ్లింది. అనంతరం రాంచంద్రయ్య తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం వెతికినా లభించలేదు. భార్య లక్ష్మి ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విశ్వజాన్ తెలిపారు.