వైభవంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-03-21T23:32:27+05:30 IST

పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్‌ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమావాస్య సందర్భంగా స్వామివారికి వివిధ రకాల పూలతో పూలంగి సేవ నిర్వహించారు.

వైభవంగా వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
: సింహవాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి

టీటీడీకి అనుసంధానంగా వేడుకలు

నాలుగో రోజు స్వామివారికి పూలంగిసేవ..ప్రత్యేక పూజలు

కొడంగల్‌, మార్చి 21: పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్‌ శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమావాస్య సందర్భంగా స్వామివారికి వివిధ రకాల పూలతో పూలంగి సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతీ రోజు మధ్యాహ్నం శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి విశేషంగా పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, చందనం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు నందారం వంశీయులు స్వామివారికి మంగళ నీరజనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-21T23:32:27+05:30 IST