దైవచింతన అలవర్చుకోవాలి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-02-02T23:47:16+05:30 IST
ప్రతీ ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపనలో భాగంగా నిర్వహించిన చండీయాగంలో పాల్గొని రూ.50వేల విరాళం అందించారు.
పూడూరు, ఫిబ్రవరి 2: ప్రతీ ఒక్కరూ దైవచింతన కలిగి ఉండాలని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపనలో భాగంగా నిర్వహించిన చండీయాగంలో పాల్గొని రూ.50వేల విరాళం అందించారు. ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ నవ్య నరసింహారెడ్డి, ఉపసర్పంచ్ రాజేందర్, నాయకులు పాల్గొన్నారు. అదే విధంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో 101 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
అత్వెల్లి హనుమాన్ ఆలయంలో శివలింగం ప్రతిష్ఠాపన
మేడ్చల్ టౌన్ : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి హనుమాన్ ఆలయంలో గురువారం శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మరకత శివలింగం, నవగ్రహాల విగ్రహాలను శాస్త్రబద్దంగా, వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్ఠించారు. ఇందులో భాగంగా హోమాలను నిర్వహించారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురువారం శివలింగ ప్రతిష్ఠతో ముగిసింది. నేతలు కొండల్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, శ్రవణ్, ఈశ్వరయ్య పాల్గొన్నారు.
వైభవంగా మల్లికార్జున స్వామి మహా పడిపూజ
మేడ్చల్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ దాక్షాయణీ దేవీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబదేవీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి ద్వాదశ జోతిర్లింగ మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివ గురుస్వామి మధన్‌రెడ్డి అధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున శివస్వాములు పాల్గొన్నారు. కార్యక్రమంలో రామలింగేశ్వరస్వామి ఆర్చకులు కార్తీక్, గురుస్వామి రుద్ర జనార్ధన్, స్వాములు పాల్గొన్నారు.
దోమ మండల కేంద్రంలో ఘనంగా ఎల్లమ్మ జాతర
దోమ : మండల కేంద్రంలో ఎల్లమ్మ జాతరలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. గ్రామస్తులు పాల్గొన్నారు.
బిజ్వార్‌లో వైభవంగా మల్లికార్జునస్వామి జాతర
తాండూరు రూరల్ : బిజ్వార్‌లో మల్లికార్జునస్వామి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో గురువారం గంగస్నానం, స్వస్తి పుణ్యహావచనం, నవగ్రహ పూజ, మహారుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు గొలుసు తెంచుట కార్యక్రమాలు నిర్వహించారు. నేడు(శుక్రవారం) ఉదయం బోనాలు, శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు పూజారి కుర్వ కిష్టయ్య తెలిపారు.
ఘనంగా కట్టమైసమ్మ అమ్మవారి ఊరేగింపు
ఘట్‌కేసర్ రూరల్ : మండల పరిధి వెంకటాపూర్‌లోని శ్రీ కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా మైసమ్మ అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఉదయం గణపతిపూజ నిర్వహించి ట్రాక్టర్‌లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులు కొబ్బరికాయలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డప్పువాయిద్యాలు, శివసత్తుల విన్యాసాలు అలరించాయి. రక్షాబంధనం, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశారాధన కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ గీతాశ్రీనివాస్, ఉపసర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ రామారావు, వార్డుసభ్యులు పాల్గొన్నారు. ఎదులాబాద్‌లోని రుక్ష్మిణీ సత్యభామ సమేతశ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సేవాకాలము, ప్రాబోధకి ఆరగింపు, మంటప ప్రాకారసేవ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం స్వామివారి దివ్యప్రబంధ పారాయణము నిర్వహించారు. ధర్మకర్తలు అప్పలాచార్యులు, ఏవీఎల్‌ఎన్ చార్యులు ఉన్నారు.
శివస్వాముల పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నవాబుపేట : మండలంలోని చించల్‌పేట్‌లో శివస్వాములు నిర్వహించిన పడి పూజ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివస్వాములు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. పూజల అనంతరం ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.