శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2023-03-29T23:34:39+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురు మహిళలు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
ఎయిర్‌పోర్టులో పట్టుబడిన గోల్డ్‌ గుళికలు

3 కేజీల 175 గ్రాములు స్వాధీనం

శంషాబాద్‌, మార్చి 29 : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన నలుగురు మహిళలు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఎయిరేట్స్‌ సంస్థకు చెందిన ఈకే 527 విమాన సర్వీసులో కొందరు మహిళా ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తరలిస్తున్నట్టు ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. దీంతో విమానం దిగిన నలుగురు మహిళా ప్రయాణికులపై అనుమానం రావడంతో వారి లగేజీలు తనిఖీ చేశారు. అందులో ఏమీ దొరకలేదు. మహిళలను స్కానింగ్‌ చేయగా వారి ప్రైవేట్‌ భాగాల్లో బంగారు గుళికలు ఉన్నట్టు తేలింది. దీంతో వారిని వైద్య విభాగానికి పంపి ఆపరేషన్‌ చేసి బంగారం గుళికలను బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు. వాటిని తూకం వేయగా 3.175 గ్రాముల బరువు ఉంది. దాని విలువ కోటి 94లక్షల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేశారు. మహిళలపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-03-29T23:34:39+05:30 IST