ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2023-07-13T00:46:23+05:30 IST

గత మూడు రోజులుగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

మూడు రోజుల్లో 2.1 కేజీల గోల్డ్‌ను సీజ్‌ చేసిన కస్టమ్స్‌ అధికారులు

నలుగురు ప్రయాణికులపై కేసు నమోదు

శంషాబాద్‌ రూరల్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి) : గత మూడు రోజులుగా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు బుధవారం అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నుంచి బుధవారం వరకు దుబాయ్‌, దమ్మమ్‌ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికులు బంగారాన్ని బిస్కెట్లు, క్యాప్సూల్స్‌, వివిధ రకాల అభరణాల రూపంలో తరలిస్తుండగా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీల్లో పట్టుబడింది. దాదాపు 2.1 కేజీల బంగారం పట్టుబడింది. ఈమేరకు బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. పట్టుబడిన గోల్డ్‌ విలువ దాదాపు రూ.కోటీ 20లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులను విచారణ నిమిత్తం నగరంలోని కస్టమ్స్‌ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-13T00:46:23+05:30 IST