అటవీశాఖ అధికారులకు నెమలి అప్పగింత

ABN , First Publish Date - 2023-03-17T00:17:17+05:30 IST

అటవీశాఖ అధికారులకు పోలీసులు నెమలిని అప్పగించారు. గురువారం మధ్యాహ్నం యాచారం మండలంలోని ఏనెకింది తండాలో పంట పొలానికి వేసిన కంచెలో జాతీయ పక్షి చిక్కుకుంది.

అటవీశాఖ అధికారులకు నెమలి అప్పగింత
నెమలిని అప్పగిస్తున్న యాచారం ఎస్సై

యాచారం, మార్చి 16 : అటవీశాఖ అధికారులకు పోలీసులు నెమలిని అప్పగించారు. గురువారం మధ్యాహ్నం యాచారం మండలంలోని ఏనెకింది తండాలో పంట పొలానికి వేసిన కంచెలో జాతీయ పక్షి చిక్కుకుంది. గమనించిన తండాకు చెందిన కిషన్‌నాయక్‌ ఇనుపచువ్వల మధ్యలో ఉన్న దానిని బయటకు తీసి కాపాడాడు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఎస్సై వెంకటనారాయణ నెమలిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

Updated Date - 2023-03-17T00:17:17+05:30 IST