ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2023-06-28T23:21:43+05:30 IST
బక్రీద్ వేడుకను పురస్కరించుకొని విద్య శాఖ మంత్రి సబితారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రంగారెడ్డి అర్బన్, జూలై 28: బక్రీద్ వేడుకను పురస్కరించుకొని విద్య శాఖ మంత్రి సబితారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను గురువారం ఆధ్యాత్మిక వాతావరణంలో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పుణ్యఫలంతో రాష్ట్రం, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైన ప్రజలు నేడు వేడుకను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.