తెలంగాణ పల్లెలు దేశాభివృద్ధికి సూచికలు
ABN , First Publish Date - 2023-03-24T23:54:32+05:30 IST
తెలంగాణ పల్లెలు దేశ అభివృద్ధికి సూచికలు అని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
వికారాబాద్/బషీరాబాద్/నవాబుపేట/మోమిన్‌పేట/పూడూరు/పరిగి/కులకచర్ల/ధారూర్/బొంరా్‌సపేట్/మేడ్చల్ టౌన్, మార్చి 24: తెలంగాణ పల్లెలు దేశ అభివృద్ధికి సూచికలు అని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉత్తమ గ్రామపంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డుల పురస్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య, మండల కో ఆప్షన్ మెంబర్ ఎర్రవల్లి జాఫర్ పాల్గొన్నారు. అదేవిధంగా బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పేరిట 27 గ్రామాలకు అవార్డులు రాగా గ్రహీతలకు అందజేశారు. ఎంపీపీ కరుణఅజయ్‌ప్రసాద్, జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలను ఎంపీపీ, జడ్పీటీసీ శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నవాంద్గీ పీఏసీఎస్ వైస్‌చైర్మన్ అజయ్‌ప్రసాద్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శ్రీను, ఎంపీడీవో రమేష్, సూపరిటెండెంట్ విజయలక్ష్మి, షేర్‌ఖాన్ పాల్గొన్నారు. అదేవిధంగా నవాబుపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే యాదయ్య చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కాలే భవానీ, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా మోమిన్‌పేట్ మండలంలోని 15 గ్రామపంచాయతీలకు ఉత్తమ అవార్డులు రావడంతో ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను ఎంపీపీ వసంత సన్మానించారు. అదేవిధంగా పూడూరు మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఉత్తమ పంచాయతీ అవార్డులు రావడం హర్షనీయమని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా పరిగి మండలంలోని ఎంపికైన ఉత్తమ గ్రామపంచాయతీల పురస్కారాలను ఎమ్మెల్యే సర్పంచులకు అందజేశారు. ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియ పాల్గొన్నారు. అదేవిధంగా కులకచర్లలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన 17 గ్రామాల సర్పంచ్‌లను, కార్యదర్శులకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సన్మానించి ప్రశంస పత్రాలు అందజేశారు. అదేవిధంగా ధారూరులోని 27 మంది సర్పంచులకు జాతీయ పంచాయతీ అవార్డులను మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, ఎంపీడీవో చంద్రశేఖర్‌లు అందజేశారు. సర్పంచులకు వారు శాలువాలు కప్పి సన్మానించి అభినందించారు. అదేవిధంగా బొంరా్‌సపేట్‌లోని గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని 26గ్రామాలను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించనున్నట్లు ఎంపీడీవో పాండునాయక్, జడ్పీటీసీ అరుణదేశ్యుఛౌహన్, ఎంపీపీ హేమీబాయి తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను బొంరా్‌సపేట్ ఎంపీడీవో కార్యాలయంలో సన్మానించారు. అదేవిధంగా మేడ్చల్‌లోని గౌడవెల్లి గ్రామపంచాయతీ జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికైంది.