అభివృద్ధిలో దూసుకెళ్తున్న కొడంగల్‌

ABN , First Publish Date - 2023-04-07T23:52:34+05:30 IST

అభివృద్ధిలో కొడంగల్‌ నియోజకవర్గం దూసుకెళ్తోందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధిలో దూసుకెళ్తున్న కొడంగల్‌
రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

  • ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

కొడంగల్‌, ఏప్రిల్‌ 7: అభివృద్ధిలో కొడంగల్‌ నియోజకవర్గం దూసుకెళ్తోందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నీటూర్‌ గేటు నుంచి అంగడిరైచూర్‌ గ్రామం వరకు రూ.10లక్షలతో శుక్రవారం రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. పట్టణాలను దీటుగా గ్రామాలను తీర్చిదిద్దుతామన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కోస్గి మండలంలోని ముక్తిపాడు గ్రామంలో వైఎస్సార్‌ టీపీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తమ్మలి బాల్‌రాజ్‌కు చెందిన వనయాంబ 70ఎంఎం థియేటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. థియేటర్‌లో రావణాసుర సినిమాను బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి కొద్దిసేపు వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కొడంగల్‌ నియోజకరవ్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-07T23:52:34+05:30 IST