ఉద్యమ స్ఫూర్తి దాత కొండా లక్ష్మణ్‌బాపూజీ
ABN , First Publish Date - 2023-09-28T00:11:50+05:30 IST
తెలంగాణ తొలి, మలి దశలో పోరాటం సలిపిన ఉద్యమ స్ఫూర్తి దాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ నారాయణరెడ్డి కొనియాడారు. బుధవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్, సెప్టెంబరు 27: తెలంగాణ తొలి, మలి దశలో పోరాటం సలిపిన ఉద్యమ స్ఫూర్తి దాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ నారాయణరెడ్డి కొనియాడారు. బుధవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్, మాజీ విద్యా మౌలిక సదుపాయాల చైర్మన్ నాగేంద్ర గౌడ్, ఎంపీపీ చంద్రకళ, పద్మశాలి సంఘం ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వయంగా ఉద్యమాల్లో పాల్గొంటూనే న్యాయవాదిగా ప్రజలకు తన వంతు సహాయం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన ఆస్తులను దార పోసిన త్యాగధనుడు అని అభివర్ణించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం వచ్చిన ప్రతిపాదనపై కలెక్టర్ స్పందిస్తూ.. రానున్న రోజుల్లో మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా అధికారులు ఉపేందర్, కొటాజీ, ఎంపీపీ ఉపాధ్యక్షడు విజయ్, కృష్ణయ్య,డాక్టర్ వీరయ్య, కే.బాల కృష్ణయ్య, తిరుపతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎస్పీ కార్యాలయంలో బాపూజీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కోటిరెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివా్‌సరావు, డీటీసీ అదనపు ఎస్పీ మురళీధర్ , ఏవో జ్యోతిర్మణి, డీఎస్పీ హన్మంత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.