బెల్టు షాపుల్లో మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2023-10-12T00:12:57+05:30 IST

ధారూరులో బుధవారం బెల్టు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై సంతో్‌షకుమార్‌ తెలిపారు.

బెల్టు షాపుల్లో మద్యం స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు

ధారూరు, అక్టోబరు 11: ధారూరులో బుధవారం బెల్టు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై సంతో్‌షకుమార్‌ తెలిపారు. ప్రతా్‌పరెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, మోమిన్‌కుర్దులో వెంకటేశ్‌గౌడ్‌ అనే వ్యక్తులు అక్రమంగా విక్రయిస్తున్న 21లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఆయన వివరించారు.

11లీటర్ల సారా పట్టివేత

పెద్దేముల్‌: సారా విక్రయిస్తుండగా పోలీ సులు దాడిచేసి 11లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లిగడ్డ తండాకు చెందిన ముడ్యా వత్‌ మాను తండా సమీపంలోని చెరువువద్ద సారా అమ్ము తున్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నెల్లిగడ్డ తండాకు చేరుకొని సారాను స్వాధీనం చేసుకొని మాను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కాశీనాథ్‌ పేర్కొన్నారు.

మద్యం పట్టివేత.. దుకాణ నిర్వాహకుడి అరెస్టు

కీసర రూరల్‌: బెల్ట్‌ షాప్‌లో పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకొని నిర్వాహకున్ని అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఓటీ, కీసర పోలీసులు తిమ్మాయిపల్లిలోని ఓ కిరాణ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో లక్ష విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకొని, బెల్ట్‌షాప్‌ నిర్వాహకుడు మల్లారపు పరశురాంను అదుపులోకి తీసుకున్నారు.

బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు

వికారాబాద్‌: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో, గ్రామాల్లో ఎవరైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీను తెలిపారు. బుధవారం వికారాబాద్‌ పరిధి గిరిగెట్‌పల్లిలో నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులపై దాడులు నిర్వహించి కొద్దిమేర మద్యాన్ని సీజ్‌ చేశారు. ఎవరైనా ఇళ్లలో మద్యం అమ్మితే చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-12T00:12:57+05:30 IST