వైభవంగా ‘మహాయాగం’

ABN , First Publish Date - 2023-06-22T23:57:17+05:30 IST

ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి టి. దేవేందర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులచే తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని వినోధిని భవన్‌లో ఐదు రోజుల పాటు నిర్వహించే చతురాయతన శతచండీ సహిత శ్రీరాజశ్యామల మహాయాగం గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

వైభవంగా ‘మహాయాగం’
మహాయాగంలో పాల్గొన్న హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ

మహేశ్వరం, జూన్‌ 22 : ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి టి. దేవేందర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులచే తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని వినోధిని భవన్‌లో ఐదు రోజుల పాటు నిర్వహించే చతురాయతన శతచండీ సహిత శ్రీరాజశ్యామల మహాయాగం గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఉదయం యాగ సంకల్పం, జగద్గురువుల వందనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, స్వస్తి పుణ్యహవచనం, రుత్విక్‌వరణం, రక్షాబంధనం, పంచగవ్యప్రాశన యాగశాల ప్రవేశం, మంటక దేవత నవగ్రహవాస్తుయోగిని, క్షేత్రపాలక సర్వతో భద్రమంటక స్థాపన పూజలు, అగ్ని మందనం, రుద్రభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్ర హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవేందర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్‌ మీనన్‌, నాయకులు మధుమోహన్‌గుప్తా, తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, కాటం భాస్కర్‌గౌడ్‌, సుధాకర్‌, శివయ్య, విలాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-22T23:57:17+05:30 IST