అనంతుడి సేవలో మహేష్‌రెడ్డి దంపతులు
ABN , First Publish Date - 2023-04-20T00:19:47+05:30 IST
అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామిని బుధవారం పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. తమ పెళ్లిరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారుతెలిపారు.
వికారాబాద్/పరిగి, ఏప్రిల్ 19: అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామిని బుధవారం పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. తమ పెళ్లిరోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారుతెలిపారు. ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, ప్రతీమ దంపతులపెళ్లి రోజు, బీఆర్‌ఎస్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పరిగిలోని తమ నివాసం నుంచి ఎస్‌గార్డెన్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించి కార్యకర్తల మధ్య కేట్‌కట్ చేశారు. ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌నాయకుడు కొప్పుల అనిల్‌రెడ్డిలకు కార్యకర్తలు భారీగజమాలతోసత్కరించారు.ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీలు బి.హరిప్రియ, మేఘమాల, కె.నాగిరెడ్డి, ఎంపీపీలు అరవింద్‌రావు, సత్యహరిశ్చంద్ర, ఎంఎసీ చైర్మన్ సురేందర్, ఆర్.అంజనేయులు, బి.ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.