బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డాగా మహేశ్వరం గడ్డ

ABN , First Publish Date - 2023-04-16T23:28:16+05:30 IST

బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డాగా మహేశ్వరం గడ్డగా తయారు కావాలని, అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఏకతాటిపైకి రావాలని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డాగా మహేశ్వరం గడ్డ
బీఆర్‌ఎస్‌లో చేరుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, మార్చి 16 : బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డాగా మహేశ్వరం గడ్డగా తయారు కావాలని, అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఏకతాటిపైకి రావాలని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మహేశ్వరం మండలం కోళ్ల పడకల్‌ గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆంగోత్‌ రాజునాయక్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికీ మంత్రి క్యాంపు కార్యాలయంలో సబితారెడ్డి బీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు చేరువ కావడానికి బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజకీయాలకతీతంగా ప్రజలకు అందేలా కృషి చేస్తూ పార్టీని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చేస్తున్న అసత్యపు ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అంజయ్య, హెచ్‌. చంద్రయ్య, ఐ. నర్సింహ్మగౌడ్‌, రఘుపతి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-16T23:28:16+05:30 IST