కొత్త ఆలోచనలకు పదునుపెట్టాలి
ABN , First Publish Date - 2023-01-12T23:52:30+05:30 IST
స్వయం సమృద్ధి గల దేశం కోసం యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేస్తూ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని ఇండియన్ కౌన్సిల్‌ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ ఆర్‌సీ అగర్వాల్ అన్నారు.
నందిగామ, జనవరి 12 : స్వయం సమృద్ధి గల దేశం కోసం యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేస్తూ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని ఇండియన్ కౌన్సిల్‌ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ ఆర్‌సీ అగర్వాల్ అన్నారు. నందిగామ మండలంలోని కన్హాశాంతివనంలో గురువారం వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జాతీయ యూత్ ఆగ్రో సమ్మిట్ కార్యక్రమాన్ని ఆయన గురూజీ కమలేష్ పటేల్‌తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ.. రామచంద్రమిషన్ హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు సహకారంతో ఇండియన్ కౌన్సిల్‌ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నుంచి 3రోజుల పాటు ఆగ్రో యూత్ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యూత్ సమ్మిట్‌లో దేశంలోని వివిధ 74 విశ్వవిద్యాలయాల నుంచి 2వేల మంది పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పురోగతి, సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేయడంలో విద్యార్థులకు కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. వాతావరణ మార్పు, నీటి కాలుష్యం, తక్కువ భూమిలో ఎక్కువ పంటను పండించడానికి తక్కువ వనరుల నుంచి ఎలా వ్యవసాయం చేయాలనే దానిపై విద్యార్థులకు ఈ కార్యక్రమం మంచి అవకాశమన్నారు. హార్ట్‌ఫుల్ సెంటర్‌ను సందర్శించినప్పుడు దాజీ మార్గదర్శకత్వంలో ప్రకృతిని తాకినట్లు అనుభూతి చెందినట్లు అగర్వాల్ తెలిపారు. గురూజీ కమలే్‌షపటేల్ మాట్లాడుతూ.. తాము చేస్తున్న వైద్య, ఆరోగ్యం, ఆధునిక వ్యవసాయం తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందించడం సంతోషకరమన్నారు. అంతకుముందు మంత్రి గురూజీతో కలిసి ధ్యానమందిరంలో అతిథులు, విద్యార్థులు 15నిమిషాలపాటు ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మిట్ కన్వీనర్ నివేదిత శ్రేయాన్స్ విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లు, అధ్యాపకులు రామచంద్రమిషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.