ఏసీబీ వలలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి
ABN , First Publish Date - 2023-04-18T22:50:18+05:30 IST
విద్యా మౌలిక వసతుల కల్పన(టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ) శాఖలో సైట్ ఇంజనీర్‌గా
వికారాబాద్, ఏప్రిల్18 : విద్యా మౌలిక వసతుల కల్పన(టీఎ్‌సఈడబ్ల్యూఐడీసీ) శాఖలో సైట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.5 వేలులంచం తీసుకుంటూ ఏసీబీఅధికారులకు పట్టుబడ్డాడు. నవాబుపేట మండలం మాదారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మనబడి కింద సివిల్ కాంట్రాక్టర్ ముష్టి ప్రభు మరమ్మతు పనులు నిర్వహించాడు. ఈ పనులకు సంబంధించి అంచనా వేయడానికి విద్య మౌలిక వసతుల కల్పన శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న సైట్ ఇంజనీర్ ఇర్ఫాన్ ప్రభు దగ్గర నుంచి ఇదివరకే రూ.51వేలు లంచం తీసుకున్నాడు. ఇదే కాకుండా మరింత డబ్బు కావాలని కొన్ని రోజులుగా కాంట్రాక్టర్ ప్రభుపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కలెక్టర్ కార్యాలయం ముందు గల పరిగి రోడ్డులో ప్రభు నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా మంగళవారం ఇర్ఫాన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. పంచనామా అనంతరం అరెస్ట్ చేసి, బుధవారం ఏసీబీ కోర్టులో ప్రవేశ పెడతామని వెల్లడించారు. ఈ లంచం డిమాండ్ వ్యవహారంలో ఇర్ఫాన్ మినహా సంబంధితశాఖ అధికారుల ప్రమేయం లేదని డీఎస్పీ వెల్లడించారు.