పకడ్బందీగా ‘పోషణ్‌ అభియాన్‌’అమలు

ABN , First Publish Date - 2023-09-07T00:18:20+05:30 IST

మహిళా శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఆ శాఖ జిల్లా అధికారి లలితకుమారి అన్నారు.

పకడ్బందీగా ‘పోషణ్‌ అభియాన్‌’అమలు
లలితకుమారి

వికారాబాద్‌, సెప్టెంబరు 6: మహిళా శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఆ శాఖ జిల్లా అధికారి లలితకుమారి అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబరు మొదటివారం నుంచి నెలాఖరు వరకు పోషణ మాసంలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మాతా, శిశు సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిశీలనకు ‘పోషణ్‌ అభియాన్‌’ను నిర్వహిస్తున్నామన్నారు. వారు తీసుకోవాల్సిన ఆహారంపై సూచనలివ్వడం, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు తెలుసుకుంటారన్నారు. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో(కొడంగల్‌, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్‌) 1,107 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 7,007 మంది గర్భిణులు, 3896 మంది బాలింతలు, 0-3ఏళ్ల చిన్నారులు 34,586 మంది, 3-6ఏళ్ల పిల్లలు 21,596 లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు ఆరోగ్యం పట్ల తమ సిబ్బంది శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. తల్లి పౌష్టికాహారం తీసుకుంటేనే శిశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలని అన్నారు.

పోషణ్‌ మాసోత్సవ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

మేడ్చల్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పోషణ్‌ మాసోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనిబలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలన్నారు. సెప్టెంబరు నెల మొత్తం జరిగే పోషణ మాసోత్సవ కార్యక్రమాలు షెడ్యుల్‌ ప్రకారం చేపట్టాలని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంబందిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నార ు.

Updated Date - 2023-09-07T00:18:20+05:30 IST