రైతుబీమాతో పేదలకు ధీమా
ABN , First Publish Date - 2023-01-22T23:39:15+05:30 IST
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అమలుచేస్తున్న సీఎంఆర్‌ఎఫ్, రైతుబీమా వంటి పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని విద్యాశాఖమంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, జనవరి 22 : దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అమలుచేస్తున్న సీఎంఆర్‌ఎఫ్, రైతుబీమా వంటి పథకాలు పేదలకు అండగా నిలుస్తున్నాయని విద్యాశాఖమంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గొల్లూరు గ్రామానికి చెందిన సిద్దోజుకుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో మృతుని కుటుంబానికి ఆదివారం మంత్రి నివాసంలో సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.60 వేలు, రైతు బీమా నుంచి రూ.5లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలుపరుస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు బీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, అది చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవ్లానాయక్, రమేష్, పాండునాయక్, కృష్ణానాయక్, విద్యాకర్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు
కందుకూరు : మండల పరిధిలోని గూడూరు, బాచుపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆదివారం మంత్రి సబితారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బాచుపల్లికి చెందిన సుధీర్‌కుమార్ ఆధ్వర్యంలో 150మంది, మండల ముదిరాజ్ సంఘం ప్రధానకార్యదర్శి సురేందర్ ఆధ్వర్యంలో 150మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఎస్.సురేందర్‌రెడ్డి, పాక్స్ చైర్మన్ డి.చంద్రశేఖర్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్.రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.