ఎస్వోటీ దాడులు..
ABN , First Publish Date - 2023-04-08T23:56:33+05:30 IST
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేసి, ఏడుగుర్ని అరెస్టు చేసి, వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లను స్వాధీన పర్చుకున్నారు.
బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
రూ.1.13లక్షలు, సెల్‌ఫోన్ల స్వాధీనం
షాద్‌నగర్, ఏప్రిల్ 8: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేసి, ఏడుగుర్ని అరెస్టు చేసి, వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లను స్వాధీన పర్చుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో షాద్‌నగర్‌కు చెందిన సురేష్ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నాడని ఎస్‌ఓటీ సీఐ సత్యనారాయణ తెలిపారు. పరిగి రోడ్డులోని హనుమాన్ ఆలయం పక్కన ఉన్న ఓ టీ స్టాల్ వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి ఏడుగుర్ని అరెస్టు చేశామన్నారు. అరెస్టయిన వారిలో సురే్‌ష, షబ్బీర్, ఎస్.యాదగిరి, ఎ.గణేష్, ఎం. జంగయ్య, ఎ.రమేష్, ఎ.కిషోర్ ఉన్నారని తెలిపారు. వారి నుంచి రూ.1.13లక్షలు, బెట్టింగ్ రాయుళ్లు వినియోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే మరో రూ.23,010 ఆన్‌లైన్ క్యాష్‌ను గుర్తించినట్టు తెలిపారు. అరెస్టు చేసిన వారితో పాటు నగదు, సెల్‌ఫోన్లను షాద్‌నగర్ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్‌లు ఎక్కడ నిర్వహించినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు.