పోగొట్టుకున్న సెల్‌ఫోన్ అప్పగింత
ABN , First Publish Date - 2023-05-12T00:04:46+05:30 IST
సీఈఐఆర్(సెంట్రల్ ఈక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) అనే అప్లికేషన్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను తిరిగి బాధితుడికి అప్పగించినట్లు మర్పల్లి ఎస్‌ఐ అరుణ్‌కుమార్ తెలిపారు.
మర్పల్లి, మే 11: సీఈఐఆర్(సెంట్రల్ ఈక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) అనే అప్లికేషన్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను తిరిగి బాధితుడికి అప్పగించినట్లు మర్పల్లి ఎస్‌ఐ అరుణ్‌కుమార్ తెలిపారు. ఈనెల 7న హైదరాబాద్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి మండలంలోని బిల్కల్ గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యాడు. అక్కడ సెల్‌ఫోన్ పోగొట్టుకోవడంతో అదేరోజు మర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీ్‌సలు సీఈఐఆర్ ద్వారా బాధితుడి సెల్‌ఫోన్ దొరికిన వ్యక్తి ఆఫోన్‌లో సిమ్‌కార్డు వేసిన వెంటనే పోలీ్‌సలకు సమాచారం వచ్చింది. దీంతో పోలీ్‌సలు ఆవ్యక్తిని పట్టుకొని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని గురువారం రవికుమార్‌కు ఫోన్ అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.