అమృత్ భారత్‌కు తాండూరు రైల్వేస్టేషన్ ఎంపిక
ABN , First Publish Date - 2023-08-02T22:46:09+05:30 IST
రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ఈనెల 6న ప్రారంభించనుంది. రాష్ట్రంలో 39 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు.
అభివృద్ధి పనులకు రూ.24.4కోట్ల్లు మంజూరు
తాండూరు, ఆగస్టు 2: రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ఈనెల 6న ప్రారంభించనుంది. రాష్ట్రంలో 39 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో తాండూరు స్టేషన్ ఎంపిక చేశారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తాండూరు రైల్వేస్టేషన్‌కు రూ.24.4కోట్లు మంజూరయ్యాయి. స్టేషన్‌లో స్వచ్ఛత, ప్రయాణికులకు వెయిటింగ్ హాల్, సమాచార వ్యవస్థలు, ఎగ్జిక్యుటివ్ లాడ్జిలు, స్టేషన్ పరిసరాల్లో చిన్న గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హయాంలో తాండూరును ఆదర్శ రైల్వేస్టేషన్‌గా ఎంపిక చేసి కొన్ని పనులు చేశారు. రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతమైన తాండూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో అభివృద్ధి కానుంది. ఆదివారం రైల్వేస్టేషన్‌కు చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీకృష్ణగౌడ్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీలత తదితరులు పేర్కొన్నారు.