TS News: గ్యాంగ్ రేప్ కేసు.. మీర్‌పేట్ నందనవనం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-08-22T11:57:31+05:30 IST

గ్యాంగ్ రేప్‌కు గురైన బాలికకు న్యాయం చేయాలంటూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి చేసింది.

TS News: గ్యాంగ్ రేప్ కేసు.. మీర్‌పేట్ నందనవనం ప్రధాన రహదారిపై ఉద్రిక్తత

హైదరాబాద్: గ్యాంగ్ రేప్‌కు గురైన బాలికకు న్యాయం చేయాలంటూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి చేసింది. బాలికకు న్యాయం చేయాలంటూ నందవనం ప్రధాన రహదారిపై స్థానికులు బైఠాయించి నిరసన చేపట్టారు. మైనర్‌పై రేప్ చేసిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనరే దిగానే. నందనవనంలోని ఇందిరమ్మ ఇళ్లల్లో ఆసాంఘీక కార్యకలాపాలు కొనసాగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందనవనంలో డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపించారు. రాజకీయ పార్టీల నేతలు, స్థానికులు కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. రాజకీయ పార్టీలకు చెందిన వారిని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన వారిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


మరోవైపు నందనవనంలో గంజాయి బ్యాచ్ అత్యాచారం కేసులో ప్రాథమిక సమాచారం మేరకు బాలికను వైద్య చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఎనిమింది నిందితులో మహేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉండే కొంతమందిని అనుమానం మేరకు పోలీసులు విచారిస్తున్నారు. మైనర్ ఎస్సీ (SC) కావడంతో ముందస్తుగా ఎలాంటి అవాంఛ సంఘటనలు కాకుండా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ వద్ద పికేట్ ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-08-22T12:00:05+05:30 IST