Share News

ప్యాసింజర్‌ ఆటోపై టిప్పర్‌ బోల్తా

ABN , First Publish Date - 2023-11-17T23:32:27+05:30 IST

అదుపుతప్పి ఓ లారీ టిప్పర్‌ ప్యాసింజర్‌ ఆటోపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

ప్యాసింజర్‌ ఆటోపై టిప్పర్‌ బోల్తా
ఆటోపై బోల్తా పడిన టిప్పర్‌

  • ఒకరు మృతి నలుగురికి గాయాలు

మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 17: అదుపుతప్పి ఓ లారీ టిప్పర్‌ ప్యాసింజర్‌ ఆటోపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున గుండ్లపోచంపల్లి నుంచి ఆటోలో నలుగురు ప్యాసింజర్‌ను ఎక్కించుకుని మేడ్చల్‌ వైపు వస్తున్న అజీజ్‌(32) సుతారిగూడ సమీపంలోని రింగ్‌ రోడ్డు వద్ద యూటర్న్‌ తీసుకున్నాడు. అదేసమయంలో మేడ్చల్‌ వైపు నుంచి డస్టులోడుతో వస్తున్న టిప్పర్‌ అదుపు తప్పి ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటో నడుపుతున్న ఆజీజ్‌ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గాయపడ్డ వారికి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-11-17T23:32:28+05:30 IST