Share News

కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులను అనుమతించాలి

ABN , Publish Date - Dec 15 , 2023 | 11:41 PM

మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు శాసనసభ స్పీకర్‌ జి.ప్రసాద్‌కుమార్‌కు విన్నవించారు.

కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులను అనుమతించాలి
ధారూరు: స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ను కలిసిన హన్మంత్‌రెడ్డి, నాయకులు

ధారూరు, డిసెంబరు 15: మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు శాసనసభ స్పీకర్‌ జి.ప్రసాద్‌కుమార్‌కు విన్నవించారు. ప్రాజెక్టుకు పర్యాటకులు రాకుండా అధికారులు నిలిపివేయడంతో బోటింగ్‌ సిబ్బంది, చిరువ్యాపారులు ఉపాధి కొల్పోయి కుటుంబాలు రోడ్డునపడ్డాయని తెలిపారు. జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జె.హన్మంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాంచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని స్పీకర్‌ నివాసంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనను శాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించేలా చూడాలని కోరారు. దీని ద్వారా బోటింగ్‌లో పనిచేసే సిబ్బందికి, అక్కడ వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు జీవనోపాధి లభిస్తుందని స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రాజెక్టుకు పర్యాటకులను అనుమతించేలా చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ తమకు హామీ ఇచ్చారని తెలిపారు.

Updated Date - Dec 15 , 2023 | 11:41 PM