ధాన్యం మొత్తాన్నీ కొనుగోలు చేయాలి : ఎంపీపీ
ABN , First Publish Date - 2023-05-04T23:41:06+05:30 IST
అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి నుంచి ధాన్యం మొత్తాన్నీ కొనుగోలు చేయాలని, ధాన్యం తడచిపోకుండా టార్పలిన్లు అందించాలని యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ప్రభుత్వాన్ని కోరారు.
యాచారం/నందిగామ/తలకొండపల్లి, మే 4 : అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి నుంచి ధాన్యం మొత్తాన్నీ కొనుగోలు చేయాలని, ధాన్యం తడచిపోకుండా టార్పలిన్లు అందించాలని యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యబాషా ప్రభుత్వాన్ని కోరారు. గురువారం యాచారం మండలంలోని మంతన్‌గౌరెల్లిలో మండల సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. చింతపట్ల, యాచారం, నందివనపర్తి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఈసందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రభుత్వం రైతులను ఆన్నివిధాలా ఆదుకుంటుందని యాచారం జడ్పీటీసీ జంగమ్మ చెప్పారు. రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి, మండల చైర్మన్ కె.జోగిరెడ్డి, టి.రాజేందర్‌రెడ్డి, చంద్రయ్య, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ జ్యోతి తదితరులున్నారు. అదేవిధంగా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని జడ్పీ వైస్‌చైర్మన్ గణేష్ అన్నారు. నందిగామ మండలం చేగూర్ పీఏసీఎస్ వద్ద ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ అశోక్‌తో కలిసి ప్రారంభించారు. పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠల్, సర్పంచులు కుమార్, గోవిందు అశోక్, రజనిత వీరెందర్, పద్మారావు, సరస్వతి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతుల శ్రేయస్సు, వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుందని బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కూన రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ముజుబుర్ రహెమాన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. సర్పంచ్ సంగీత, పంచాయతీ కార్యదర్శి శరత్ కుమార్, వార్డుసభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.