సత్యసాయి ఆలయంలో ఆరాధన వేడుకలు

ABN , First Publish Date - 2023-04-25T23:03:37+05:30 IST

శ్రీసత్యసాయి జ్ఞాన కేంద్రంలో సోమవారం రాత్రి ఓంకారం, భజన సంకీర్తన, ఆధ్యాత్మిక సందేశం, మహా మంగళహారతి, అనంతరం భక్తులకు నారాయణసేవ నిర్వహించారు.

సత్యసాయి ఆలయంలో ఆరాధన వేడుకలు

వికారాబాద్‌, ఏప్రిల్‌ 25: శ్రీసత్యసాయి జ్ఞాన కేంద్రంలో సోమవారం రాత్రి ఓంకారం, భజన సంకీర్తన, ఆధ్యాత్మిక సందేశం, మహా మంగళహారతి, అనంతరం భక్తులకు నారాయణసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సమన్వయకర్త బందెప్పగౌడ్‌ మాట్లాడుతూ.. భగవాన్‌ సత్యసాయి బోధనలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సాధనల ద్వారా ప్రపంచ శాంతికి అందరూ కృషి చేయాలన్నారు. విద్య, వైద్యం, నీరు, మౌలిక వసతుల కల్పనలో సత్యసాయిబాబా అనేక లక్షల మందికి సేవ చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ సత్యనారాయణగౌడ్‌, సభ్యులు సత్యకుమార్‌, వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్‌, మహిళలు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-25T23:03:37+05:30 IST